![]() |
![]() |

భారతీయ చిత్ర పరిశ్రమ సగర్వంగా చెప్పుకునే స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan). ఎన్నో హిట్ చిత్రాలతో సినిమా రేంజ్ ని పెంచాడు. కొంత కాలం నుంచి హిట్ అనేది సల్మాన్ వద్దకి చేరకపోయినా, డిజాస్టర్ అనేది సల్మాన్ రేంజ్ ని ఇంచు కూడా తగ్గించలేకపోయింది. మే 29, న బాలీవుడ్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'కాలా హిరణ్': ది బ్యాటిల్ ఫర్ లెగసీ' అనే మూవీ టీజర్ రిలీజయ్యింది
1998 వ సంవత్సరంలో సల్మాన్ పై నమోదైన కృష్ణజింకల వేట కేసు ఆధారంగా రూపుదిద్దుకుంటున్నట్టుగా టీజర్ లో ఉంది. దీంతో ఆ చిత్ర ప్రచార కంటెంట్, సల్మాన్ ఖాన్ వ్యక్తిగత ప్రతిష్టని తీవ్రంగా దెబ్బతీసేలా ఉందని సల్మాన్ తరుపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. పిటిషన్‌లో ' టీజర్ లో సల్మాన్ లాగానే ప్రసిద్ధ బ్లూ బ్రాస్‌లెట్‌ను కూడా ధరించి ఉండటంతో ప్రేక్షకులు ఇది నేరుగా ఆయన కథేనని భావించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయుధాల చట్టం (ఆమ్స్ యాక్ట్) కింద నమోదైన 4 కేసులలో 3 కేసుల నుండి సల్మాన్ ఖాన్ నిర్దోషిగా విముక్తి పొందినప్పటికీ, సినిమాలో ఆయన తుపాకీ పట్టుకున్నట్లు చూపించడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి. చిత్ర నిర్మాత అమిత్ జానీ తన ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను లారెన్స్ బిష్ణోయ్ వివాదంతో, అండర్ వరల్డ్ లింకులతో ముడిపెట్టి ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని న్యాయ బృందం కోర్టు ముందు బలంగా వినిపించింది.
Also read: రూమర్ ని నిజం చేసిన హీరోయిన్.. ఆ క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో
దీంతో ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఒక్కసారి కోల్పోయిన ప్రతిష్టని మళ్లీ తిరిగి తేలేము. ప్రతినిమిషం ఈ కంటెంట్ పబ్లిక్ డొమైన్‌లో ఉంటే పిటిషనర్ ప్రతిష్టకి అపారమైన నష్టం వాటిల్లుతుందని జస్టిస్ జ్యోతి సింగ్ స్పష్టం చేశారు. 1998 నుండి కోర్టుల్లో నడుస్తున్న కృష్ణజింకల కేసు ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉందని, ఇలాంటి ప్రచార చిత్రాల వల్ల నిష్పాక్షికమైన విచారణ పొందే హక్కుకు భంగం కలుగుతుందని భావించారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసే ధోరణి సహించరానిదని చిత్ర బృందానికి గట్టి హెచ్చరిక జారీ చేస్తూ, డిజిటల్ మాధ్యమాల నుండి అన్ని వివాదాస్పద కంటెంట్ లింకులను 24 గంటల నిర్దేశిత సమయ పరిమితిలోగా తొలగించాలని ఆదేశించింది. ఒకవేళ వారు విఫలమైతే యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్రధాన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లే స్వయంగా 24 గంటల్లోగా ఆ లింకులని నిలిపివేయాలని స్పష్టం చేసింది.
Salaman Khan, Kala Hiran Teaser

![]() |
![]() |